మదనపల్లె మిట్స్‌ ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు పోటీలు

0
67

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద గల మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వారి సౌజన్యంతో కురుబలకోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ వారు ప్రవేశ పెట్టిన స్వచ్ఛత పక్కవాడ కార్యక్రమములో భాగంగా పాఠశాలలోని విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత రోజును నిర్వ హించినారు.ఇందులో భాగంగా విద్యార్థులకు పరిశుభ్రత గురుంచి పోటీలను నిర్వహించారు.శుభ్రత గురించి వ్యాసరచన, చిత్రలేఖనము,చర్చ పోటీ (డిబేట్) మరియు నాటికలను పాఠశాలలోని విద్యా ర్థులకు నిర్వహించారు.

విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఈ పోటీలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్.జి.సదాశివ ప్రసాద్ మాట్లాడుతూ పరిచయం చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ఒక మంచి అలవాటని, చేతులకు మొదట సబ్బు రాసుకుని,బాగా రుద్దిన తరువాత నీటితో శుభ్రం చేసు కోవాలని, ఎందుకంటే మన చేతిలో మన కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు చాలా ఉంటాయని, చేతుల పరిశుభ్రత యొక్క ముఖ్య ఉద్దేశ్యం చేతుల మీద ఉన్న మట్టి, సూక్ష్మజీవులు మరియు బాక్టీరియాలను తొలగించడమన్నారు.

చేతులను శుభ్రం చేసుకోవటం అంటే మనకు మనం వ్యాధి నిరోధక టీకాలను ఇచ్చుకుంటున్నట్లేనని, చేతుల ద్వారానే వ్యాధి కారక సూక్ష్మక్రిములు శరీరంలోనికి ప్రవేశిస్తాయనేది సత్యమన్నారు.మన గ్రామాలలో వచ్చే వ్యాధుల్లో శరీర పరిశుభ్రత లోపించడం వల్ల వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా ఉంటున్నాయని,తలలో పేలు,గజ్జి,పుండ్లు, పిప్పిపళ్ళు,నీళ్ల విరేచనాలు,బంక విరేచనాలు ఇలాంటి జబ్బులన్నీ శరీర పరిశుభ్రత లేకపోవటము వలన వస్తాయని, శుభ్రత పాటించటం వలన వీటన్నిటినీ నివారించవచ్చునన్నారు.స్నానం చేయకుండా ఉంటే మురికి,చమట,నూనె వలన తలలో గడ్డలు పుండ్లు ఏర్పడతాయి, తలపైవున్న చర్మంలో చెమటలాంటి జిగట పదార్థం మురికిని వదిలించడానికి కనీసము వారానికి ఒకసారి తలస్నానం చేయాలని విద్యార్థులతో అన్నారు.

కండ్లు,చెవి,ముక్కు ప్రతి రోజు శుభ్రమైన నీటితో కడుక్కోవాలని, విద్యార్థులకు జలుబు చేసినప్పుడు శ్రద్ధగా ముక్కులను మెత్తటి నూలు బట్టతో శుభ్రపరచాలని లేకపోతే వారికి గాలి పీల్చటము కష్ట మవుతుందన్నారు.రోజూ మంచి పోషక ఆహారం తీసుకోవాలని అన్నారు.మన పాఠశాలలో వంట చేస్తున్న ప్రదేశాన్ని,పాత్రలను శుభ్రంగా ఉంచాలన్నారు.మనం చేసే పనులన్నీ చేతుల ద్వారానే జరుగుతాయి కావున అన్నం తిన్నా,ముక్కు చీదినా చేతులతోనే చేస్తాం.ఇన్ని రకాల పనులు చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన మలినాలన్నీ చేతికి అంటుకుంటాయి, కావున చేతులను,మన పరిసరాలను శుభ్రముగా ఉంచుకోవాలన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాఉ త్రివేణి మాట్లాడుతూ మిట్స్ కళాశాల వారు వారి సమయాన్ని తమ పాఠశాల విద్యార్థులకు కేటాయించి శుభ్రతపై పోటీలను నిర్వహించడం, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కళాశాల యెన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ నరసింహా, పాఠశాల అధ్యాపకులు శ్రీనివాసులు,చంద్ర శేఖర్,సునీత,సయ్యద్ బేగ్ మరియు ప్రసాద్,మిట్స్ యెన్.ఎస్.ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.