మదనపల్లిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య

0
181

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
ఓ వ్యాధితో బాథపడుతున్న రోగి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చి అనుహ్యంగా బాత్రూమ్ లో ఉరేసకొని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో బుధవారం రాత్రి జరిగింది. మనఛానల్ కు అందిన సమాచారం ప్రకారం బి.కొత్తకోట మండలం గోళ్లపల్లి పంచాయతీ గుడిశవారిపల్లికు చెందిన మనోహర్ రెడ్డి (25) అనే యువకుడు వైద్యం కోసం మదనపల్లి పట్టణంలో ఆర్.టి.సి. బస్టాండ్ కు సమీపంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో బుధవారం రాత్రి వేళ అందరూ నిద్రించిన తరువాత ఆసుపత్రిలోని బాత్రూమ్ లోకి వెళ్లి తాను ధరించిన లుంగి పంచెతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన కొందరు ఆసుపత్రి యజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వెంటనే టూటౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి సంఘటన స్థలాన్ని పరిశీలించి రోగి ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలు తెలుసుకొంటున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.