ఏపీ కానిస్టేబుల్‌ ఫలితాలను విడుదల చేసిన సీఎం వై.ఎస్‌.జగన్‌

0
81

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో హోంమంత్రి సుచరిత పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలను గురువారం సీఎం క్యాంపు కార్యాలయం నందు విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి డీజీపీ గౌతమ్‌ నవాంగ్‌, ఆంధ్రప్రదేశ్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ కుమార్‌ విశ్వజీత్‌లు హాజరయ్యారు.

సివిల్,ఆర్ముడ్ రిజర్వ్,ఏపీఎస్పీ,ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్,జైలు వార్డర్స్ విభాగాల్లోని మొత్తం 2723 పోస్టులకు గాను 2623 మంది అభ్యర్థులు ఎన్నికయ్యారు. వీరిలో 500 మంది మహిళలున్నారు.ఆయా సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో వంద పోస్టులు మిగిలిపోయాయని పోలీసు శాఖ తెలిపింది.

ఎంపికైన అభ్యర్థుల జాబితాను http://slprb.ap.gov.in/ వెబ్ సైట్లో ఉంచినట్లు పోలీసు శాఖ తెలి పింది.ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.com కు ఈ నెల 16వ తేదీలోపు అభ్యంతరాలు పంపవచ్చని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టి ఫికేట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తామని పోలీసు శాఖ వెల్లడించింది.