ఈనెల 14న మదనపల్లెలో జాతీయ లోక్‌ అదాలత్‌

0
62

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా మదనపల్లెలో ఈనెల 14 శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నారు.ఈ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారానికి పోలీసు మరియు సంబంధిత అధికారులు సహకరించాలని రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు మండల న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు జి.జ్ఞాన సువర్ణ రాజు పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు మదనపల్లె న్యాయవాదుల సంఘం భవనంలో జరిగిన సమావేశంలో మదనపల్లె పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా పోలీసు స్టేషన్ పరిధిలోనే కేసులను రాజీ చేయదగిన అన్ని క్రిమినల్ కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి పోలీసు అధికారులు చొరవ చుపాలన్నారు.ముఖ్యంగా కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకుంటే డబ్బు, సమయము ఆదా అవడమే కాకుండా కక్షదారుల కళ్ళ ఎదుటే వారి కేసులు తక్షణమే పరిష్కారం అవుతాయని తెలిపారు. కేసులపై కక్షదారులకు అవగాహన కల్పించుకోవచ్చునన్నారు.లోక్ అదాలత్ పై కక్షదారులలో చైతన్యం తీసుకొచ్చి కేసులు పరిష్కరించడానికి కృషి చేయాలని తెలిపారు.

శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారంలో లక్ష్యాలను చేరుకోవాలని పోలీసు శాఖ అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ జియా ఉద్దీన్,ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జీ ఇందిరా ప్రియదర్శిని, ఇంచార్జ్ డి.ఎస్.పి వంశీధర్ గౌడ్,సిఐలు,తమీం అహ్మద్, రాజేంద్ర నాద్ యాదవ్,అశోక్ కుమార్, వెంకటేశులు,బి.కొత్తకోట, ముది వేడు, నిమ్మనపల్లె, మదనపల్లె 1వ, 2వ తాలుకా పోలీసు స్టేషన్ల ఎస్.ఐలు, తదితరులు పాల్గొన్నారు.