అత్యంత వైభవంగా కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర

0
84

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణలో అత్యంత పెద్దదైన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. మహాగణపతి నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు. మధ్యాహ్నం కల్లా మహాగణపతి నిమ జ్జనం కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్గ్ లోని విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తున్నారు. మహాగణపతి నిమజ్జనానికి ట్యాంక్ బండ్ పై క్రేన్ సిద్దం చేశారు.

ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్ర సాగుతుంది ఇలా…

  • సెన్సేషన్‌ థియేటర్‌, టెలిఫోన్‌ భవన్‌, ఎక్బాల్‌ మినార్‌, తెలుగుతల్లి చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా సాగుతుంది.
  • ఉదయం 10.30గంటలకు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నం 6 వద్దకు మహాగణపతి చేరుకుటుంది.
  • ఉదయం 9.30గంటల నుంచి 10.30గంటల వరకు ట్రాలీపై ఉన్న విగ్రహం చుట్టూ వెల్డింగ్‌ పనులతో జాయింట్లను తొలగిస్తారు.
  • ఉదయం 10.30గంటల నుంచి 11.30గంటల వరకు గంగా హారతి, స్వామి వారికి పూజలు చేస్తారు.
  • 12.30 నుంచి 1గంట మధ్య క్రేన్‌ సాయంతో విగ్రహాన్ని సాగర్‌లో నిమజ్జనం చేస్తారు.