నూతన ఇసుక విధానంపై ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌ సమీక్ష

0
26
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఏపీలో అమల్లోకి వచ్చిన నూతన ఇసుక విధానంపై బుధవారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఇసుకలో అవినీతిని అడ్డుకోవడం వల్ల అది సహించలేని కొందరు ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇసుక స్టాక్‌యార్డు పాయింట్లు పెంచాలని, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

వరద తగ్గగానే రీచ్‌ల నుంచి ఇసుక వీలైనంత త్వరగా స్టాక్‌ యార్డులకు చేరేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.ఇసుక మాఫియాను అరికట్టడానికి అవసరమైన సాంకేతిక సహకారం తీసుకోవాలని చెప్పారు.ప్రజలు ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని వెల్లడించారు.ఏ స్ధాయి లో కూడా అవినీతి ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.ఇసుక రవాణా విషయంలో ఇబ్బందులు అధిగమించామా అని అధికారులను ప్రశ్నించారు.

ఎక్కడెక్కడ ఇసుక కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అందుకనుగుణంగా నిర్మాణాదారులు ప్లాన్‌ చేసుకుంటారని చెప్పారు.అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్‌ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.ఫుటేజీని మానిటరింగ్‌ చేసే వ్యవస్ధ కూడా ఉండాలని అన్నారు.బల్క్‌ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని అధికారులకు చెప్పారు.