తెదేపా శిబిరాల నుండి బాధితులను తరలిస్తున్న పోలీసులు

0
70

మనఛానల్‌ న్యూస్‌ – గుంటూరు
ఆంధ్రప్రదేశ్‌లో ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమంతో ఉద్రిక్తత నెలకొన్న సంగతి విదితమే.అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు ఒకరిపై ఒకరు పోటీగా ఛలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో ఇరు పార్టీ నాయకుల ను పోలీసులు ఎక్కడికక్కడే నిర్భందించిన సంగతి విదితమే.అయితే పోలీసులు శిబిరాల్లో ఉండే ప్రజలను వారు స్వగ్రామాలకు తరలిస్తున్నారు.

మొత్తం ఐదు గ్రామాలకు చెందిన 200 మంది ఈ శిబిరంలో ఉన్నట్లు గుర్తించారు.అయితే ప్రతి ఊరికీ ఒక బస్సులను ఏర్పాటు చేసి వారిని స్వగ్రామాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు.ఈ రోజు ఉదయం నుంచి శిబిరంలోకి ఎవరినీ అనుమతించని పోలీసులు,చలో ఆత్మకూరు పిలుపు మేరకు అక్కడికి వచ్చిన తెదేపా నేతలను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న ఆర్టీవో భాస్కర్‌ రెడ్డి బాధితులతో సంప్రదింపులు జరిపారు.వారికి ఉన్న సమస్యలపై ఆరా తీశారు.ఈ శిబిరానికి రావాల్సిన ఆవశ్యకత ఏమిటని ప్రశ్నించారు.అనంతరం వారికి భద్రతా పరమైన హామీలు ఇవ్వడంతోపాటు వారిని స్వగ్రామాలకు వెళ్లేందుకు ఒప్పించి వాంగ్మూలాలను సేకరించారు.