ఖైరాతాబాద్‌ గణేశుడి శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు

0
58

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణలో అతిపెద్దదైన ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర రేపు జరుగనుంది.దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రులు,అధికారులు.ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధంగా ఉంచారు.సాగర తీరంలో క్రేన్‌ నెం.6 వద్ద ప్రత్యేకంగా ఖైరతాబాద్‌ మహాగణపతిని సంపూర్ణ నిమజ్జనం గావించేందుకు 20 ఫీట్లకు పైగా లోతు పెంచామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎన్‌టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెం.6 వద్ద ఏర్పాట్లను పరిశీ లించారు.అనంతరం మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు అన్ని పండుగల్ని ఘనంగా జరుపు కోవాలని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానికి లక్షలా దిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.

మహాగణపతి నిమజ్జన ఊరేగింపు 12వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెం.6 వద్దకు 12గంటలకు చేరుకుంటుందని,అన్ని పనులు పూర్తిచేసి ఒంటి గంటలోపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని తెలిపారు.