ఎట్టకేలకు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్‌

0
69

మనఛానల్‌ న్యూస్‌ – పశ్చిమ గోదావరి
దళితులను దూషించి,దౌర్జన్యం చేసినట్టు కేసులను ఎదుర్కొంటున్న దెందులూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు.గత 12 రోజులుగా ఆయన పరారీలో ఉన్న సంగతి విదితమే.ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య చింతమనేని బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన అనుచరులు రెచ్చిపోయారు.చింతమనేని నివాసంలో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను అనుచరులు నిర్బంధించారు.ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు చింతమనేని అరెస్టు చేశారు.పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఇదే కాకుండా పలు అక్రమాలు,దౌర్జన్యాలకు సంబంధించి చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చింతమనేని అజ్ఞా తంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.