ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బీరువా బహుకరణ

0
68

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరుజిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట అమ్మ అనాథ ఆశ్రమానికి ఓ బీరువాని బహుమతిగా ఇచ్చారు మాజీ ఎంపీపీ,వైఎస్సార్‌సీపీ నాయకులు పాగొండ ఖలీల్‌ అహ్మద్‌.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజాసమస్యల కోసం పరితపించే నాయకుడు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి అని కొనియాడారు.తంబళ్లపల్లి నియోజకవర్గపు అభివృద్ధికి ఆయన తనవంతు కృషి చేస్తున్నారన్నారు.ప్రజల అభ్యున్నతికి పాటుపడే ఎంపీ మిథున్‌రెడ్డి ఇలాంటి జన్మదినాలను మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఇకపోతే సమాజంలో తమ వారి ఆదరణకు దూరమైన వారికి ప్రతిఒక్కరూ తమవంతు సహకారం అందించాలన్నారు.అటువంటి వారికోసం అమ్మ ఆశ్రమ నిర్వాహకులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఆశ్రమ అవసరాల కోసం తమవంతు సహకారంగా బీరువాను అందించడం జరిగింద న్నారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి మండల కన్వీనర్ ప్రదీప్ రెడ్డి వైయస్సార్సీపి నాయకులు రాయల్ సలీం జెబి తదితరులు పాల్గొన్నారు.