ఉభయ గోదావరి జిల్లాలకు రూ.10 కోట్ల వరద సాయం ప్రకటించిన ప్రభుత్వం

0
22
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
గోదావరి నది వరదలతో బిక్కుబిక్కుమంటున్న ఉభయ గోదావరి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది.వరదలతో తీవ్రంగా సతమతమవుతున్న ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసు కొంటుంది.ఇందులో భాగంగా తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలలకు ప్రత్యేక సాయంగా రూ.10 కోట్ల 9 లక్షల 20వేలను విడుదల చేసింది.ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

గోదావరి వరదల కారణంగా ఇళ్లు నష్టపోయిన కుటుంబాలకు రూ.5వేల చొప్పున సాయం అంద జేసేందుకు ఈ నిధులను మంజూరు చేసింది.వరదల కారణంగా ఒకవారంపాటు నీటిలో మునిగిపోయి ధ్వంసమైన, శిథిలమైన ఇళ్లకు సాయంగా రూ.5 వేల చొప్పున వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించనుంది. ఈ నిధుల్లో రూ.7,21,75,000 తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించగా రూ.2,87,45,000 పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించింది.

వరద బాధితులను తక్షణమే ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన సిఫారసుల మేరకు ఈ నిధులను విడుదల చేసింది.వరదల కారణాంగా నష్టపోయిన బాధితులను గుర్తించి వారికి సాయం అందజే యాలని,నిబంధనలకు అనుగుణంగా ఈ సాయం అందుకునే లబ్ధిదారుల పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.