బ్రిటీష్‌ పార్లమెంట్‌ ఐదువారాలపాటు సస్పెండ్‌

0
54

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రవేశపెట్టిన ప్రతిపాదన రెండవసారి కూడా వీగిపోయిన విషయం తెలిసిందే.దీంతో బ్రిటీష్‌ పార్లమెంట్‌ను ఐదువారాలపాటు సస్పెండ్‌ చేశారు.ఈ నేప‌ థ్యంలో హౌజ్ ఆఫ్ కామ‌న్స్‌లో ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు.త‌మ స్వ‌రాన్ని సైలెంట్ చేశార‌ని వారు ఆరోపించారు. ఎన్నిక‌ల అంశాన్ని ప్ర‌తిప‌క్ష ఎంపీలు వ్య‌తిరేకించారు.

బ్రెగ్జిట్ వ‌ద్దంటూ బ్రిట‌న్ ఎంపీల మ‌ధ్య బేధాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.ఎన్నిక‌లు నిర్వ‌హించా లంటూ పెట్టిన తీర్మానికి 293 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు.కానీ మూడ‌వ వంత మెజారిటీ కోసం కొన్ని ఓట్లు త‌క్కువ‌య్యాయి.మ‌ళ్లీ అక్టోబ‌ర్ 14వ తేదీన పార్ల‌మెంట్ స‌మావేశం కానున్న‌ది.