ప్రిన్స్‌ మహేష్‌తో మరోసారి జోడీకడుతున్న మిల్కీ బ్యూటీ

0
78

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
మహర్షి సినిమాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు ప్రిన్స్‌ మహేష్‌ బాబు.ఆయన ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తున్నాడు.ఎఫ్ 2 తరువాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్‌ హీరోయిన్‌ విజయ శాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు మరింత గ్లామర్‌ యాడ్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమాలో కీలక సందర్భంలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌లో స్టార్‌ హీరోయిన్‌ ఆడిపాడ నున్నారు.

ప్రస్తుతం తెలుగు,తమిళ,హిందీ సినిమాలతో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా మహేష్‌ సినిమాలో ప్రత్యేక గీతంలో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ఆగడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన తమన్నా ఇప్పుడు మరోసారి సూపర్‌ స్టార్‌తో ఆడిపాడనున్నారు.