జాతీయహోదాను తొలగించొద్దంటూ సీఈసీని కోరిన మూడు పార్టీలు

0
44

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
సిపిఐ,తృణమూల్‌ కాంగ్రెస్‌,ఎన్సీపీలు తమకు జాతీయపార్టీ హోదాను తొలగించొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి.ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు తమకు మరొక్క అవకాశమివ్వాలని విన్నవించుకున్నాయి.తాము జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నామని,కేవలం ఇటీవలి జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే తమకు జాతీయ హోదాను తొలగించొద్దని అభ్యర్థించాయి.

2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఓట్ల శాతం ఆధారంగా జాతీయ హోదాపై ఈ మూడు పార్టీలకు ఈసీ నోటీసులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ వాదనను వినిపించాయి.కాంగ్రెస్‌ పార్టీ తర్వాత అంతటి ప్రాచీనమైన చరిత్ర కలిగిన పార్టీ తమదేనని, లోక్‌సభలో తమపార్టీ చాలాసార్లు ప్రతిపక్షంగా ఉందని సిపిఐ ఈసీ ముందు వాదనలను వినిపించింది.

ఇటీవలి ఎన్నికల్లో సరైన పనితీరు కనబరచకపోయినప్పటికీ పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటూ వచ్చామని రాజ్యాంగ పరిరక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తున్నామని పేర్కొంది.తమ పార్టీకి 2014లో జాతీయపార్టీ హోదా ఇచ్చారని,కాబట్టి కనీసం 2024 వరకు అయినా జాతీయహోదాను కొనసాగించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ కోరింది.