యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విజేత రాఫెల్‌ నాదల్‌

0
41
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌

స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ తన కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు.ఆదివారం రాత్రి హోరాహోరీగా సాగిన యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ ఫైనల్లో ఐదో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో ఓడించి విజేతగా నిలిచాడు.దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ రికార్డుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు.

తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అడుగు పెట్టిన మెద్వెదేవ్‌ అంత సులువుగా తలవంచలేదు.మొదటి రెండు సెట్‌లు రాఫెల్‌ గెలిచినప్పటికీ మెద్వెదేవ్‌ కుంగిపోకుండా మొండి ధైర్యంతో పోరాడు.మూడు, నాలుగు సెట్లను దక్కించుకుని నాదల్‌కు చెమటలు పట్టించాడు.నిర్ణయాత్మక ఐదో సెట్‌లో రాఫెల్‌ విజృంభించ డంతో మెద్వెదేవ్‌ ఓటమి పాలయ్యాడు.నాలుగు గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ క్రీడా భిమానులను ఆకట్టుకుంది.

చాంపియన్‌ రాఫెల్‌కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు) రన్నరప్‌ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.20 గ్రాండ్‌స్లామ్‌ టైటిట్స్‌తో రోజర్‌ ఫెదరర్‌ నాదల్‌ కంటే ముందున్నాడు.మరో టైటిల్‌ సాధిస్తే ఫెదరర్ రికార్డును నాదల్‌ సమం చేస్తాడు.