ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంఫియన్‌షిప్‌ టైటిల్‌ విజేత పి.వి.సింధు

0
50
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు తన కలను సాకారం చేసుకుంది.తన చిరకాల ప్రత్యర్థి ఒకుహారాపై చిరుత పులిలా విరుచుకుపడి సింధు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా ఈ తెలుగమ్మాయి కొత్త చరిత్ర లిఖించింది.

ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్‌ నింగ్‌ (స్వర్ణం,2 రజతాలు,2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం,2 రజ తాలు,2 కాంస్యాలు) సమం చేసింది.

ఒకుహారాపై తాజా విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు ఆ«ధిక్యాన్ని 9–7కు పెంచుకుంది. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుకు 13 వేల ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.ప్రపంచ చాంపి యన్‌షిప్‌లో విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు.వారికి కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు.