మదనపల్లె సాయివిద్యానికేతన్‌ హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

0
79
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని సాయివిద్యానికేతన్‌ హైస్కూల్‌ నందు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ మోడెం శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు, దేవకిల ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు.

చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి.ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారన్నారు.కృష్ణుడు చిన్న తనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయిందన్నారు.అనంతరం శ్రీ కృష్ణుడు,గోపికల వేషధారణలతో వచ్చిన చిన్నారులు అలరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ మరియు ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో చూడముచ్చట యిన అలంకారాలతో అనగా శ్రీకృష్ణుడు మరియు గోపికమ్మ వేషధారణలు ధరించిన దాదాపు 76 మంది చిన్నారులచే పండుగ సంబరాలు చేపట్టడం జరిగింది.అనంతరం చిన్నారులు చేసిన పాటల కచేరి, నృత్య ప్రదర్శనలు పాఠశాల విద్యార్థినీ,విద్యార్థులనే కాక చూపరులను సైతం చూడ ముచ్చటగా ఆకట్టుకున్నాయి.మధ్యాహ్నం చిన్నారులచే నిర్వహించిన ఉట్టి కార్యక్రమంతో పండుగ సంబరాలను ఘనంగా జరిగాయి.అనంతరం కృష్ణుడు,గోపికమ్మ వేషధారణులకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది.