ఈ-కేవైసీపై వదంతులు నమ్మొద్దు – ఏపీ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

0
31
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – వైఎస్సార్‌ కడప
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన అంశం ఈ-కేవైసీ.దీనిపై శనివారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టతనిచ్చారు.ఈకేవైసీ చేసుకోకుంటే రేషన్‌ రావని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని,ఇటువంటి వాటిని ప్రజలు నమ్మవద్దన్నారు.

నిరుపేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని,ప్రజల సంక్షేమ కోసం అహర్నిశలు పనిచేస్తామ న్నారు.అదేవిధంగా ఈ-కేవైసీ సాకుతో పేర్లు తొలగించారంటూ డీలర్లు రేషన్‌ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చంటి బిడ్డలతో గంటల తరబడి ఆధార్‌ నమోదు కేంద్రాల వద్ద పడి గాపులు పడాల్సిన అవసరం లేదన్నారు.

ఈ-కేవైసీకి గడువులేదని ఎప్ప్పుడైనా చేయించుకోవచ్చన్నారు.దేశ,విదేశాల్లో వున్న వారు ఈ-కేవైసీలు చేయించడానికి పరుగులు పట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఈ-కేవైసీ సులభతరం చేసేందుకు మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.