బీజేపీ సభ్యత్వ నమోదుకు మదనపల్లెలో భారీ స్పందన – పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌

0
78

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
భారతీయజనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణంలో భారీ స్పందన లభిస్తోందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బర్నేపల్లి రవికుమార్‌ అన్నారు.మంగళవారం పట్ట ణంలోని పలు ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మునిసి పాలిటీ పరిధిలో అన్నివార్డుల్లో భారీగా సభ్యత్వాలు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పార్టీలతో ప్రజలు విసుగెత్తి అవినీతి రహిత పాలనను అందిస్తున్న బీజేపీ వైపు స్వచ్ఛందంగా మొగ్గు చూపుతున్నారని, ఇదే విషయం రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా రుజువవుతుందన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అన్నిరంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తున్నదని,దీనిని దృష్టిలో ఉంచుకొని సుపరిపాలన,అభివృద్ధి,దేశ భవిష్యత్తుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

మదనపల్లె మున్సిపాలిటీలో పార్టీకి మంచి పట్టు ఉందని, జిల్లాలోనే రికార్డు స్థాయిలో మదనపల్లెలో సభ్వత్వ నమోదు చేశామన్నారు.యువత ఆన్‌లైన్ ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యల్లంపల్లి ప్రశాంత్‌,బీజేపీ నాయకులు పూల నాగరాజు ఇతర నాయకులు మరియు కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.