చిరు అభిమానుల్లో అంచనాలను పెంచేసిన ‘‘సైరా’’ టీజర్‌

0
30
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘‘సైరా నరసింహారెడ్డి’’ టీజర్‌ వచ్చేసింది. ఈ టీజర్‌ చిరు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేసింది.మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి.మెగా తనయుడు రామ్‌ చరణ్‌ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఒక టీజర్‌తో పాటు, మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.రిలీజ్ డేట్‌ దగ్గరపడుతుండటంతో మరో టీజర్‌ను మంగళవారం ముంబైలో రిలీజ్ చేశారు.

భారీ యాక్షన్‌ విజువల్స్‌లో రూపొందించిన ఈ టీజర్‌ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది. పవన్‌ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్‌, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో వావ్‌ అనిపించేలా డిజైన్‌ చేశారు. మెగాస్టార్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, విజయ్‌ సేతుపతి,జగపతి బాబు,రవికిషన్‌,తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.