చిత్తూరు జిల్లా బి.సి , ఓ.బి. సి ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా శ్రీ కె. మునెప్ప మొదలి ఎన్నిక

0
120

మనఛానల్ న్యూస్ – పలమనేరు
చిత్తూరు జిల్లా బిసి మరియు ఇ.బి.సి ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడుగా కె. మునెప్ప మొదలి ఎన్నికైనట్లు జిల్లా బిసి ఉద్యోగ సంఘ అధ్యక్షులు లక్ష్మీపతి యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. పలమనేరు పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో సోమవారం జరిగిన బి సి ఉద్యోగుల సంఘ సమావేశంలో ఈ ఎన్నిక జరిగిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బిసి ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి చేయాల్సిన పోరాట విధానాలను పలువురు ఉద్యోగ సంఘం నేతలు తమ ప్రసంగాలలో వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు లల వెంకట కృష్ణయ్య, పలమనేరు నియోజకవర్గ బిసి ఉద్యోగ సంఘం అధ్యక్షులు హేమ కుమార్, పలమనేరు మండల వైయస్సార్ ఆర్ బి సి సెల్ అధ్యక్షుడు ఆది శేఖర్ స్వతంత్ర బాబు, చాణుక్య మరియు గంగవరం మండల ఉపాధ్యాయులు చంద్రశేఖర్ , రఘుపతి తదితర ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.