మదనపల్లె మిట్స్‌లో ‘‘ఉమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌’’ అనే అంశంపై అవగాహన సదస్సు

0
450

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా కురబలకోట మండల అంగళ్లు వద్ద గల మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల) మరియు హ్యూమన్‌ రీసోర్స్‌ డెవప్‌మెంట్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌డి) వారు ‘‘ఉమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌’’ అనే అంశంపై శనివారం సదస్సును నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అజిజ్ తయ్యబా, విశ్రాంతి వింగ్ కమాండర్, మను శ్రీనివాసన్ మాజీ సీనియర్ డైరెక్టర్ & హెడ్ హెచ్ ఆర్, బయోక్లినికా, మీనాక్షి వీరాని హెడ్ అఫ్ హ్యూమన్ రిసోర్సెస్ కాంటినెంటల్ ఆటోమోటివ్, డాక్టర్ రేణు రజని ఫౌండర్ గెట్ మీ ఎనబుల్డ్, షావర్ బాను అసోసియేట్ డైరెక్టర్, హెచ్ ఆర్, ఎవరీ ఇండియా మరియు స్మిత స్వామి, హెచ్.ఆర్ & ఐఆర్, ఫెస్టో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు పాల్గొన్నారు.

ముందుగా అజిజ్ తయ్యబా మాట్లాడుతూ మహిళలు తమకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలిగితే ఏ రంగంలోనైనా రాణించగలరన్నారు.స్మితస్వామి మాట్లాడుతూ లైఫ్ ఎక్సపీరియన్సును వివరిస్తూ సహచరులతో మనం ఏ విధంగా మేదగాలో, మరియు ఈ సొసైటీలో మంచి స్థానానికి రాగలగాలంటే సహచరుల యొక్క సూచనలను పాటించి, మంచి చెడులను తెలుసుకోవాలన్నారు.డాక్టర్ రేణు రజని మాట్లాడుతూ మహిళల జీవితాలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి తగినన్ని విలక్షణతలను విద్యార్థినీలకు వివరించారు.

మను శ్రీనివాసన్ మాట్లాడుతూ మహిళలు ప్రతి విషయంలోను బాధలకు మరియు అన్యాయాలకు లోనైనా కూడా వారు ఓర్పు సహనంతో నిలదొక్కుకోగలిగితే విజయం ఖాయన్నారు.ఒక విద్యార్థిని అడిగిన ప్రశ్న – మహిళలు ప్రతి చిన్న విషయానికి బాధపడి కన్నీటిని కారుస్తూ ఉంటారు.ఆలా చేస్తే మహిళలు బలహీనమైన వారు అనుకోవచ్చా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిసందేహంగా మహిళలు బలహీనులు కాదని, వాళ్ల బాధను వ్యక్తపరిచే విధానం మాత్రమేనన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.హంపమ్మ,డీన్ రామప్రసాద్ రావు,స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ సమీనా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.