తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌ కుమార్‌

0
84

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియ మిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు.సీఎం కేసీఆర్ స్వయంగా వినోద్‌కుమార్‌కు ప్రగతిభవన్‌లో నియామక ఉత్తర్వు లను అందజేశారు.వినోద్‌కుమార్ ఈ పదవిలో మూడేండ్లు కొనసాగుతారు.ప్రణాళికాసంఘం ఉపాధ్య క్షుడిగా వినోద్‌కుమార్ క్యాబినెట్ హోదా కలిగి ఉండటంతోపాటు రాష్ట్ర క్యాబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు.

ప్రణాళికాసంఘం అధ్యక్షుడిగా సీఎం వ్యవహరిస్తారు. రాష్ర్టాభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళి కాసంఘం భూమిక అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్‌కుమార్‌ను ఉపాధ్యక్షుడిగా సీఎం నిర్ణయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి, ప్రతిపాదనలు తయారుచేసే పనిని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌కుమార్‌కు అప్పగించారు.

రాజకీయాల్లో,పరిపాలనాఅంశాల్లో ఉన్న అనుభవంతోపాటు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక,ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్‌కుమార్ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఈ నియామకం చేపట్టినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులైన వినోద్‌కుమార్‌కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌చేశారు.