అట్టహాసంగా ప్రారంభమైన సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం

0
62

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
ఖతార్‌లో శుక్రవారం సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) వేడుకలు అట్టహాసంగా ప్రారంభ మైంది.ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.ఇప్పటికే తెలుగు,కన్నడ,తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులకు అవార్డులు ప్రదానం చేశారు.వేడుకకు మెగాస్టార్‌ చిరం జీవి, కీర్తి సురేశ్‌, రాధిక,శ్రియ,పాయల్‌ రాజ్‌పుత్‌,యశ్‌,విజయ్‌ దేవరకొండ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు ప్రముఖ యాంకర్‌ సుమ, హాస్యనటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

సైమా అవార్డుల్లో విజేతలు వీరే…

 • ఉత్తమ చిత్రం : మహానటి
 • ఉత్తమ దర్శకుడు : సుకుమార్‌ (రంగస్థలం)
 • ఉత్తమ పరిచయ దర్శకుడు : అజయ్‌ భూపతి (ఆర్‌ ఎక్స్‌ 100)
 • ఉత్తమ నటుడు : రామ్‌చరణ్‌ (రంగస్థలం)
 • ఉత్తమ పరిచయ నటుడు : కల్యాణ్‌ దేవ్‌ (విజేత)
 • ఉత్తమ నటుడు (క్రిటిక్‌) : విజయ్‌ దేవరకొండ (గీత గోవిందం)
 • ఉత్తమ నటి : కీర్తి సురేశ్‌ (మహానటి)
 • ఉత్తమ నటి (క్రిటిక్‌) : సమంత (రంగస్థలం)
 • ఉత్తమ పరిచయ నటి : పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
 • ఉత్తమ సహాయ నటి : అనసూయ భరద్వాజ్‌ (రంగస్థలం)
 • ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్రప్రసాద్‌ (మహానటి)
 • ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
 • ఉత్తమ హాస్యనటుడు : సత్య (ఛలో)
 • ఉత్తమ ప్రతినాయకుడు : శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
 • ఉత్తమ గీత రచయిత : చంద్రబోస్‌(రంగస్థలం- ఎంత సక్కగున్నావే)
 • ఉత్తమ గాయని : ఎం.ఎం మానసి (రంగస్థలం- రంగమ్మా..మంగమ్మా పాట)
 • ఉత్తమ గాయకుడు : అనురాగ్‌ కులకర్ణి (ఆర్‌ ఎక్స్‌ 100- పిల్లారా.. పాట)
 • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు (రంగస్థలం)
 • ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌ : మౌనిక రామకృష్ణ (రంగస్థలం)
 • పాపులర్‌ సెలబ్రిటీ ఆన్‌ సోషల్‌మీడియా : విజయ్‌ దేవరకొండ