43వ శతకాన్ని నమోదు చేసిన కోహ్లీ – మూడోవన్డేలో టీమిండియా ఘనవిజయం

0
44
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
భారత ప్రజలకు టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందించింది.కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 43వ శతకం నమోదు చేయడంతో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను కోహ్లి సేన కైవసం చేసుకుంది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158/2తో ఉండగా వాన ఆటను నిలిపివేసింది.

కొంత సమయం తర్వాత మొదలైన ఆటకు మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది.దీంతో విండీస్‌ 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్ణయించారు.ఈ లక్ష్యాన్ని భారత్‌ 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 114 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, శ్రేయాస్‌ ఐయ్యర్‌ 65 పరుగులు చేశాడు.

కాగా ఈ వన్డేలో మరో సెంచరీ బాదిన కోహ్లీకి ఇది 43వ సెంచరీ. సచిన్‌ టెండ్కూర్‌ తర్వాత వన్డేల్లో అత్య ధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.అంతేకాక 50 సెంచరీల దిశగా దూసుకెళ్తున్నాడు .ప్రపంచకప్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని కోహ్లీ ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి మళ్లీ పూర్వ వైభవాన్ని చాటుకున్నాడు.