మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

0
61

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయం నందు గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడు కలను ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా సబ్‌కలెక్టర్‌ శ్రీమతి కీర్తి చేకూరి కార్యాలయం ఆవ రణంలో ఉన్న మహాత్మాగాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి, ఆంగ్లే యుల పాలన నుండి విముక్తి పొందుటకు ఎందరో మహాను భావులు వారి త్యాగఫలం వల్ల నేడు 73వ వేడుకలు స్వేచ్చగా జరుపుకుంటున్నామని తెలిపారు. అప్పటి నుండి భారత దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని, పిల్లలు బాగా చదువుకొని దేశం అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని పిల్లలకు సూచించారు.నేటి బాలలే రేపటి భారత భావి పౌరులని తెలిపారు.

అనంతరం చిత్తూరు జిల్లా కేంద్రం నందు జరిగే 73వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొని, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె.నారయణ స్వామి గారి నుండి అవార్డు స్వీకరించుటకు చిత్తూరుకు బయలుదేరివెళ్ళారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ ఈశ్వరయ్య,ఏ.ఓ జయ రాముడు,డిప్యుటీ తాహసీల్దార్, గురుప్రసాద్,శేషయ్య, షమ్షీర్ ఖాన్, ఆర్.ఐ లు ప్రసాద్, కుమారి,అనీష సబ్ కలెక్టర్ కార్యాలయపు సిబ్బంది,ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.