భారీవర్షాల ధాటికి దేశవ్యాప్తంగా 270 మంది మృతి

0
235

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశవ్యాప్తంగా 270 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.ముఖ్యంగా కేరళ,కర్నాటక,మహారాష్ట్ర,గుజరాత్‌, తమిళనాడు,మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌,ఉత్తరప్రదేశ్‌,అసోం తదితర రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు.కేరళలో 95, కర్నాటకలో 54,మహారాష్ట్ర 48,గుజరాత్‌ 35,ఉత్తరప్రదేశ్‌ 34,రాజస్థాన్‌ 23,తమిళనాడు 24 అసోంలో 19 మంది చొప్పున మృతిచెందగా,వేలాది ఎకరాల్లో పంట నష్టమైంది.

లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.పలు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ముంబయి నగరంలోని మురికివాడల్లో నివాసముంటున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.అసోంలోని కజిరంగా నేషనల్‌ పార్కు పూర్తిగా నీటమునిగింది.దీంతో అక్కడ పలు మృగాలు మృత్యువాతపడ్డాయి.వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆయా రాష్ట్రాల అగ్నిమాపకశాఖలు నిరంతరం శ్రమిస్తున్నాయి.