భారీగా దిగివచ్చిన బంగారం ధరలు – ఒక్కరోజులోనే రూ.2 వేలు క్షీణత

0
52
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
అంతర్జాతీయంగా,దేశీయంగా పుత్తడి,వెండి ధరలు క్షీణించాయి.దీంతో పసిడి పరుగుకు కళ్లెం పడింది. రికార్డు గరిష్టాలను నమోదు చేసిన బంగారం ధర భారీగా దిగి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం ఒక్కరోజులోనే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,490 తగ్గుదలతో రూ.37,000కు పతనమైంది.10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 తగ్గుదలతో రూ.35,760కు దిగొచ్చింది.

అంతర్జాతీయంగా బలమైనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ రికార్డుస్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలు, జువెలర్లు,రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌ వార్‌పై అంచనాలతో ఆసియా కరెన్సీలు బలపడ్డాయి.చైనా ఉత్పత్తులపై దిగుమతులపై 10శాతం దిగుమతి సుంకంఅమలును డిసెంబర్‌కు వాయిదా వేసింది.దీంతో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం భారీగా పుంజుకుంది.

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది.పసిడి ధర ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 1,532.15 డాలర్లకు చేరింది.అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 17.32 డాలర్లకు ఎగసింది.మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది.కేజీ వెండి ధర రూ.47,265 వద్ద నిలకడగా కొనసాగుతోంది.పరిశ్రమ యూనిట్లు,నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం.