ఏపీ,తెలంగాణల్లో ఘనంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

0
51
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి

విజయవాడలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన సీఎం జగన్‌

తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణల్లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించు కుంటున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.మువ్వన్నెల జెండాను ఎగుర వేశారు.

అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 13 శాఖల శకటాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో,పాఠశాలలు,కళాశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను చేసుకున్నారు.

ఈ సందర్భంగా విధినిర్వహణలో సాహసాలు ప్రదర్శించిన పోలీసు అధికారులకు సీఎం మెడల్స్‌ ప్రదానం చేశారు.ఈ వేడుకల్లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

గోల్కోండకోటలో జాతీయపతాకాన్ని ఎగరవేసిన సీఎం కేసీఆర్‌

advertisment

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు.ఆ తరువాత రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.