ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ – దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

0
62

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రజలంతా ఘనంగా నిర్వహించుకుంటున్నారు.ఇందులో భాగంగా దేశరాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయపతకాన్ని ఎగుర వేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌ చేరుకున్న ఆయన జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.అక్కడి నుంచి ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధానికి త్రివిధ దళాలు గౌరవవందనం సమర్పించాయి.

ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి,భాజాపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా,రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌,మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌,పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజర య్యారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యం అని అన్నారు.స్వాతంత్ర్యం అనంతరం శాంతి, సమృద్ధి, భద్రతకు అందరూ కృషి చేశారని కొనియా డారు.అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని తెలిపారు.

ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తమకు అవకాశం ఇచ్చారని,వారు ఆశించిన మేరకు సుపరిపాలన అందిస్తామని పేర్కొన్నారు.ప్రజల ఆకాంక్షల మేరకు చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాం. అందులో భాగంగానే ఆర్టికల్‌ 370,35ఏ రద్దు చేశాం.సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కలలను నెరవేర్చాం.వ్యవస్థలను గాడిలో పెట్టాం. వేగవంతంగా పని చేసేలా ముందుకెళ్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.