ఎందరో మహానుభావుల త్యాగఫలం స్వాతంత్య్రం – మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌ బాషా

0
74

మనఛానల్‌ న్యూస్‌ – చిన్నతిప్పసముద్రం
మనమంతా భారతదేశంలో సుఖసంతోశాలుగా జీవిస్తున్నామంటే ఎందోరో మహానుభావులు త్యాగఫలం ఉందని శాసనసభ్యులు ఎం.నవాజ్ బాష పేర్కొన్నారు. గురవారం ఉదయం చిత్తూరుజిల్లా మదనపల్లె రూరల్ మండలం సి.టి.ఎం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిల్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 73వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ దేశాలలో అగ్రదేశాలలో మన భారతదేశం ఒకటని తెలిపారు.పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని తెలిపారు.పిల్లలు బాగా చదువుకొని తల్లితండ్రులకు పాఠశాలకు, జిల్లా కు,దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిల్లలకు సూచించారు.నాపై నమ్మకం ఉంచి నన్ను ఎం.ఎల్. ఏగా 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు మీకందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని, మీకు అందుబాటులో ఉండి మీకు ఎలాంటి సమస్య ఉన్ననూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి మిథున్ రెడ్డి సహకారంతో మదనపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.కులాలకు,మతాలకు,అతీతంగా ప్రభుత్వ పథకాలను అందజేస్తామన్నారు.రాష్ట్రంలో అక్షరాస్యత పెంచేందుకు అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజలు కష్టాలు చూసి నవరత్నాల పథకాలను అందజేయాలనే ఉద్దేశంతో నవరత్నాల పథకం అమలుపరచడం జరుగుతుందని, అందులో భాగంగానే అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి విద్యార్థికీ సంవత్సరానికి రూ.15 వేలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి మన ముఖ్యమంత్రని తెలిపారు.రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించడం జరుగుతుందని తెలిపారు.బాలికలకు చదువుపై ఆసక్తి పెంచేందుకు 8,9 తరగతులు చదివే పిల్లలకు సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ సందర్బంగా ఎం.ఎల్.ఏ 10వ తరగతి చదివే బాలికలు సౌజన్య,ఇంద్రజలకు సైకిళ్ళు పంపిణీ చేశారు.అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటారు.

అనంతరం శాసనసభ్యులకి పాఠశాల తరపున ఉపాద్యాయులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హృశికేశ్ రెడ్డి,ఎన్.సి.సి ఉపాధ్యాయుడు గిరిధర్ నాయక్,పాఠశాల టీచర్స్,ఆంజనేయులు,పాఠశాల అభివృద్ది కమిటీ అద్యక్షులు ఆనంద్ పార్థ సారధి,మాజీ కౌన్సిలర్లు జింకా చలపతి,ఖాజా,మురళి,ప్రజా ప్రతినిధులు వీర ప్రతాప్,వెలుగు చంద్ర,బాబు ఖాన్,విలేజ్ వాలంటీర్లు,పిల్లల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.