అత్తివరదరాజస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

0
69

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో వెలసిన శ్రీఅత్తివరదరాజస్వామి దర్శనానికి భక్తులు పోటె త్తారు.వరదరాజస్వామి ప్రతి 40 ఏళ్లకు ఒకసారి పూర్తిగా కోనేటిలోనే భక్తులకు దర్శనమిస్తారు. అరుదుగా లభించే ఈ దర్శనభాగ్యం కోసం దేశం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.

ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.ఇప్పటి వరకు కోటిమంది వరకు స్వామివారి దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.అయితే మరో రెండు రోజులు మాత్రమే ఈ దర్శనానికి అవకాశం ఉండడంతో భక్తుల రద్దీ మరింతగా పెరుగుతోందన్నారు.

కాగా ఈవాళ సాయంత్రం 5 గంటల నుండి అత్తివరదరాజస్వామి దర్శనాలను గరుడసేవ నేపథ్యం నిలిపివేయనున్నారు.దీంతో వీవీఐపీ,వీఐపీ దర్శనాలను రద్దు చేశారు.అత్తిరాజస్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి వచ్చే భక్తుల కోసం తమిళనాడు ప్రభుత్వం అన్నిసౌకర్యాలను కల్పించింది.