రివాల్వర్‌తో కాల్చుకొని ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య

0
44

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
హర్యానాలో ఫరీదాబాద్‌ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విక్రమ్‌ కపూర్‌ బుధవారం తన సర్వీసు రివాల్వతో కాల్చుకొని మృతిచెందాడు.ఫరీదాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయన ఆత్మహత్యకు పాల్పడడం కలకం రేపింది.విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం దీనిపై విచారణ చేపడతామని తెలిపారు.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.అయితే పని ఒత్తిడి కారణంగా విక్రమ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన విక్రమ్‌ గత ఏడాదే ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు.