గుండెపోటుతో మదనపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

0
187
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన బుధవారం చిత్తూరుజిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది.రామసముద్రం మండలం మట్లివారిపల్లె జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల నందు ఆంగ్లం ఉపాధ్యాయుడుగా వెంకటరమణ (58) విధులు నిర్వర్తిస్తున్నాడు.అయితే బుధవారం ఉదయం ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు.వెంటనే కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తర లించారు.అయితే ఆయన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.ఆయన మృతి పట్ల తోటిఉపాధ్యాయులు,ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.అందరితో కలసిమెసి ఉండేవారని సహచర ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.