కరకట్ట నిర్మాణాలలోకి వరద నీరు – అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం

0
62

మనఛానల్‌ న్యూస్‌ – విజయవాడ
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని కరకట్టపైన ఉన్న నిర్మాణాలలోకి వరదనీరు ప్రవేశించింది.ఇక్కడ చంద్రబాబు నివాసం కూడా ఉన్న సంగతి విదితమే.దీంతో కృష్ణాజిల్లా కలెక్టర్‌ కరకట్ట ప్రాంతాన్ని పరి శీలించారు.అనంతరం రెవెన్యూ అధికారులకు కరకట్ట ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఈ కరకట్ట నిర్మాణాలన్నీ అక్రమేనని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 28 మందికి నోటీసులు ఇచ్చింది.

కరకట్ట ఆనుకొని టిడిపి ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను సైతం సీఎం జగన్‌ ఆదేశాల మేరకు సీఆర్‌ డీఏ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.దీనిపై మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి ఆర్కే మాట్లాడుతూ వరద ముంపు ఉందని తెలిసీ ఇక్కడ అక్రమనిర్మాణాలు చేశారని, ఇటు వంటి అక్రమ నిర్మాణాల్లోనే మాజీ సీఎం చంద్రబాబు నివాసముండడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా మని వివరణ ఇచ్చారు.

ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర,కర్నాటకల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ధాటికి కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్నదని, ఇప్పటికే చంద్రబాబు నివాసంలో మెట్లపైకి వరదనీరు చేరిందని,ఉధృతి మరింత పెరిగితే ఇళ్లు కూడా మునిగిపోయే పరిస్థితి నెలకొందని ఆర్కే వివరించారు.