కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్‌ – పీవోకేలో యుద్ధవాతావరణం

0
65

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజనను జీర్ణించుకోలేని దాయాది దేశం పాకిస్థాన్‌ భారత్‌పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది.ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మోదీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో మోదీ ప్రభుత్వం నడుస్తోందని,కశ్మీర్‌ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకో కుండానే కశ్మీర్‌ను విభజించడం సమంజసం కాదన్నారు. పైగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌పై ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌ అంశంలో భారత్‌ చర్యకు ప్రపంచదేశాలు మద్ధతుగా నిలువగా, పాకిస్థాన్‌కు ఏ ఒక్క దేశమూ మద్ధతు తెలుపకపోవడంతో జీర్ణించుకోలేకపోతోంది.పైగా ప్రతి విష యంలోనూ ఆ దేశానికి మద్ధతుగా నిలిచే చైనా సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం దాయాది దేశానికి మింగుడుపడడం లేదు.అదేవిధంగా అగ్రరాజ్యం అమెరికా కశ్మీర్‌ విషయంలో తాము మధ్య వర్తిత్వం చేసుకోదలుచుకోలేదని వెల్లిడించింది.దీంతో ఎటూ దిక్కుతోచని పాకిస్థాన్‌ కయ్యానికి కాలు దువ్వుతోంది.

పీవోకేలో ఆ దేశానికి చెందిన యుద్ధవిమానాలు సంచరిస్తుండడం,కవ్వింపు చర్యలకు దిగడంతో భారతదేశపు ఆర్మీ అప్రమత్తమైంది.పీవోకేలో మరింత సైన్యాన్ని అమర్చింది.పాక్‌కు ధీటైన సమాధానం ఇచ్చేందుకు సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ ఛీఫ్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ విభజన అనంతరం ఆ రాష్ట్రంలో పంద్రాగష్ట్‌ వేడుకలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆర్మీ చర్యలు తీసుకుంటోంది.