భాజపాలో చేరిన 10 మంది సిక్కిం ఎమ్మెల్యేలు

0
49

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
10 మంది సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు.ఈ 10 మంది ఎమ్మెల్యేలు.. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఆ పార్టీ అధికార ప్రతినిధి రామ్‌మాధవ్‌ సమక్షంలో చేరారు.

10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో ఒకేసారి చేరడం సిక్కిం మాజీ సీఎం,ఎస్‌డీఎఫ్‌ అధినేత పవన్‌ కుమార్‌ ఛామ్లింగ్‌కు ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ 15 స్థానా ల్లో గెలువగా,సిక్కిం క్రాంతికరి మోర్చా(ఎస్‌కేఎమ్‌) 17 స్థానాల్లో గెలిచింది.

దీంతో అప్పటి వరకు అధికారంలో ఉన్న ఎస్‌డీఎఫ్‌ అధికారాన్ని కోల్పోయింది.సిక్కిం అసెంబ్లీ స్థానాలు 32.అయితే ఇప్పుడు ఎస్‌డీఎఫ్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో అసెంబ్లీలో ఆ పార్టీ సంఖ్యా బలం 5కు పడిపోయింది.అధికారంలో ఉన్న ఎస్‌కేఎమ్‌ ఎన్డీయేలో కొనసాగుతోంది.