పోలీసుల ఎదుట లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – తూర్పు గోదావరి
రాజోలు నియోజకవర్గం మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రాజోలు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్‌ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్న తొమ్మిది మందిని మలికిపురం ఎస్సై కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంపై రాపాక అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే.

అంతటితో అగకుండా రాపాక తన అనుచరులతో కలిసి పోలీస్‌ స్షేషన్‌పై దాడికి పాల్పడ్డారు.దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాపాక ఏ1గా ఉన్నారు.మరోవైపు జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు.ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల యువతకు పోలీస్‌ వ్యవస్థను ఏమైనా చేయవచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు.ఒకవేళ ఎస్‌ఐ తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.