పరుగులు పెడుతున్న వెండి ధరలు – రూ.45 వేలకు చేరిన కేజీ ధర

0
146

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
భారతదేశ మార్కెట్లలో వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.కొనుగోళ్ల అండతో పాటు అంతర్జా తీయంగా సానుకూలంగా సంకేతాలతో బులియన్‌ మార్కెట్లో నేడు వెండి ధర దూసుకెళ్లింది. మంగళ వారం ఒక్క రోజే రూ.2000 పెరిగి జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 45,000కు చేరినట్లు ఆల్‌ ఇండియా సఫారా అసోసియేషన్‌ వెల్లడించింది.

అటు బంగారం ధర నేడు స్వల్పంగా దిగొచ్చింది. రూ.100 తగ్గడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పసిడి ధర రూ.38,370గా ఉంది.అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి పెరగడంతో బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపర్లు భావించారు.దీంతో ఈ లోహాల ధరలు పెరిగాయని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయంగానూ వీటి ధరలు పెరిగాయి.న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం 1,520.37 డాలర్లు , ఔన్సు వెండి 17.32 డాలర్లు పలికింది.ఇటీవల బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది.అప్పటి నుంచి ఈ లోహాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.