నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌పై అవగాహన కార్యక్రమం

0
49

మనఛానల్‌ న్యూస్‌ – వాల్మీకిపురం
నెహ్రూయువకేంద్రం ఆధ్వర్యంలో చిత్తూరుజిల్లా పీలేరు నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలం పుస్తకాల పడగ గ్రామంలో స్వచ్ఛభారత్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నెహ్రూ యువకేంద్రం వాల్మీకిపురం బ్లాక్‌ కార్యకర్త అయ్యప్పరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచాలన్నారు.గ్రామంలో పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఎలాంటి వ్యాధులు అయినా నివారించవచ్చునన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల అన్నారు.ఈ రకంగా చేయడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగానే పరిసరాలను శుభ్రపరచడం జరిగింది.

పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యపడుతుందని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామంలో యువత,పెద్దలు పాల్గొ న్నారు.ఈ కార్యక్రమంలో భాస్కర్,శ్రీరాములు,వెంకటరమణ,అయ్యప్ప రెడ్డి చంద్రశేఖర్, రాకేష్, తది తరులు పాల్గొన్నారు.