కాపు రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి ముద్రగడ పద్మనాభం లేఖ

0
46

మనఛానల్‌ న్యూస్‌ – తూర్పుగోదావరి
భారత ప్రధాని నరేంద్ర మోదీకి కాపు రిజర్వేషన్ల అంశంపై కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం మంగళవారం లేఖ రాశారు.2017లో తెదేపా ప్రభుత్వం ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లలో కాపులకు 5శాతం కోటా కేటాయించిందని, దీనిని కేంద్రం ఆమోదించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఏపీలో ప్రభుత్వాలు,ముఖ్యమంత్రులు మారుతున్నా కాపుల తలరాతలు మారలేదన్నారు.ఎన్నికల ముందు ఒక విధంగా, ఎన్నికల అనంతరం ఒక విధంగా వ్యవహరించడం రాజకీయ పార్టీలకు పరిపాటి మారిందన్నారు.రిజర్వేషన్లు కల్పిస్తామని హామీలు ఇస్తూ ప్రభుత్వాలు తమ జాతిని మోసం చేస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే కాపులను వాడుకుంటున్నారని ప్రధానికి రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.