అనుమతులు ఎత్తిపోతల పథకాలను ఆపండి – ఏపీకి ఎన్జీటీ ఆదేశం

0
51

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
పర్యావరణ అనుమతులు లేని ఎత్తిపోతల పథకాలను ఆపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది.గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం,పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఆయా పథకాలను నడపాలని ఆదేశించింది. గోదావరి,పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌,త్రినాథ్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై గతంలోనే విచారణ చేపట్టిన ఎన్జీటీ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతుంటే మీరేం చేస్తున్నారంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీ పీసీబీ) కేంద్ర పర్యావరణ శాఖలపై అక్షింతలు వేసింది. దీనిపై ఆయా బోర్డులతో ఓ సంయక్త కమిటీని నియమించింది. నష్టాన్ని అంచనావేసి నివేదిక ఇవ్వాల్సిందిగా నాలుగు వారాల సమయమిచ్చింది. తాజాగా ఆ కమిటీ నివేదిక అందజేసింది.దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.