66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన – సత్తా చాటిన టాలీవుడ్‌

0
67
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
66​వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించారు.సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’ సినిమా​కు జాతీయ పురస్కారం లభించింది.ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది.

ఉతమ నటుడు అవార్డును ఆయుష్మాన్‌ ఖురానా, నిక్కీ కౌశల్‌లకు సంయుక్తంగా ప్రకటించారు.సాం​కేతిక విభాగాల్లో ఈసారి తెలుగు సినిమాలకు ఎక్కువ పురస్కారాలు లభించాయి.హిందీలో ఉత్తమ చిత్రంగా అంధాధున్‌ ఎంపికైంది.పద్మావత్‌ చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కించుకున్నారు.

66వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వివరాలు

ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా (అంధాధున్‌)
ఉత్తమ నటి: కీర్త సురేశ్‌ (మహానటి)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య దర్‌(ఉడి)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహానటి
ఉత్తమ యాక్షన్ సినిమా‌: కేజీఎఫ్‌
బెస్ట్‌ మేకప్‌, విజువల్‌, స్పెషల్‌ ఎఫెక్ట్‌: అ!
ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: చి.ల.సౌ
ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం
ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌
ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌
ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌: ఉత్తరాఖండ్‌
ఉత్తమ తమిళ చిత్రం: బారమ్‌