9 నెలల చిన్నారి హత్యకేసులో ముద్దాయి ప్రవీణ్‌కు ఉరిశిక్ష

0
75
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – వరంగల్‌
ముక్కు పచ్చలారని 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో ముద్దాయి ప్రవీణ్‌కు వరంగల్‌ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది.ఈ కేసులో ప్రవీణ్‌ నేరం చేసినట్టు కోర్టు నిర్ధారించింది. జూన్‌ 18న అర్ధరాత్రి సమయంలో చిన్నారిపై ప్రవీణ్‌ ఘాతుకానికి పాల్పడిన విషయం విదితమే.

తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన ప్రవీణ్‌ ఆ బిడ్డపై అత్యాచారం చేసి హత్యమార్చాడు. చిన్నారిపై అత్యాచారం,హత్య ఘటనను వరంగల్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.ఘటన జరిగిన 20 రోజుల్లోపే ఈ కేసుకు సంబంధించి కోర్టులో పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేశారు.

వేగంగా దర్యాప్తు జరిపి సాక్ష్యాలు సేకరించి నేరాన్ని నిరూపించారు పోలీసులు. ఈ కేసులో 30 మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించారు.మొత్తంగా ఘటన జరిగిన 50 రోజుల్లోనే కేసు దర్యాప్తు చేసి శిక్షను ఖరారు చేశారు.