ప్రియాప్రకాశ్‌తో విజయ్‌దేవరకొండ – వైరల్‌ అవుతున్న ఫోటో

0
165

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
ఒక కన్నుగీటుతో కోట్లాది కుర్రహృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నది కేరళ కుట్టి ప్రియాప్రకాశ్‌ వారియర్‌.ఈ పేరుకు సినిమా ప్రేమకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.ఆమె పేరు చెబితే కుర్రాళ్ళ గుండెల్లో రైళ్ళు ప‌రిగెడుతుంటాయి.ఒరు ఆదార్ ల‌వ్ అనే సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన ప్రియా ప్ర‌కాశ్ శ్రీదేవి బంగ్లా అనే బాలీవుడ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ద‌మైంది.

ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది ఈ అమ్మ‌డు.టాలీవుడ్ ల‌వ‌ర్ బోయ్ నితిన్ 28వ సినిమాగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు.ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్నారు.ఇటీవ‌ల‌ పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.నితిన్ సినిమాతోనే ఆమె తెలుగు డెబ్యూ ఇస్తుంది.

అయితే కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లోఉంటున్న ప్రియా ప్ర‌కాశ్ యూత్ ఫుల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ని క‌లిసింది.ఆయ‌న‌తో ఫోటో దిగి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.నువ్వంటే నాకు చాలా ఇష్టం అనే కామెంట్ ఫోటోకి పెట్టింది.ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.ప్రియా త్వ‌ర‌లో విజ‌య్‌ తో క‌లిసి సినిమా చేసిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అంటూ నెటిజ‌న్స్ స్పందిస్తున్నారు.