మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

0
35
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతోంది.దీంతో జీవనదిని తలపిస్తున్న గోదావరిని చూసేందుకు పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుగా మేడిగడ్డ జలాశయం వద్దకు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అధికారులు,ఇంజినీర్లతో కలిసి ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు.

మేడిగడ్డ ఆనకట్టపైకి చేరుకున్న ముఖ్యమంత్రికి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,జయశంకర్‌ భూపాల పల్లి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరులు, ఎస్పీ భాస్కరన్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం 70,71 గేట్ల వద్ద గోదావరి మాతకు పూలు,పట్టు వస్త్రాలు సమర్పించి సీఎం కేసీఆర్‌ పూజలు నిర్వ హించారు.చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ బ్యారేజీపై కాలినడకన వెళ్తూ నీటి నిల్వను పరిశీలించారు.

వ్యూపాయింట్‌ వద్దకు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏరియల్‌ సర్వే నిర్వహించారు.అధికారులు, ఇంజినీర్లతో కలిసి విహంగ వీక్షణం ద్వారా గోదావరి పరవళ్లను వీక్షించారు.గోదావరి ప్రవాహానికి సంబంధించిన వివరాలను ఇంజినీర్లు ఆయనకు వివరించారు.