మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం – 13 మంది దుర్మరణం

0
140
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
వారంతా వ్యవసాయ కూలీలు.ఎక్కడ పని ఉంటే అక్కడ ఆటోలో వెళ్లి పను ముగించుకొని తిరిగి సొంత గూటికి చేరుకోవడం ఆనవాయితీ.ప్రతిరోజులాగే ప్రమాదం జరిగిన రోజుసైతం మరో ఐదు నిమిషాలైతే ఇంటికి చేరుకొంటారనుకొనేలోపు లారీ రూపంలో మృత్యువు వచ్చి మీదపడింది. పరిమితికి మించి ప్రయాణికులతో వస్తున్న ఆటోను అపరిమిత వేగంతో వెళ్తున్న లారీ ఢీకొన్నదఆటోలో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. దవాఖానకు తరలిస్తుండగా మరొకరు చని పోయారు.

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి సమీపంలోని చిల్వేర్ గేట్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్‌రాష్ర్టాన్ని కలచివేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనూహ్యమైన ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మం డలం కొత్తపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందారు.

మిడ్జిల్ మండలం వాడ్యాలలో వ్యవసాయ పనులు ముగించుకొన్న కూలీలు స్వగ్రామమైన కొత్తపల్లికి ఆటోలో వస్తుండగా చిల్వేర్ గేట్ దగ్గర సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జడ్చర్ల నుంచి కల్వకుర్తి వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీకొన్నది.ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్‌తోపాటు మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నారు.లారీ అతి వేగంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది.

పన్నెండు మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని చికిత్సకోసం మొదట సమీపంలో ఉన్న బాదేపల్లి కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించారు.తర్వాత మెరుగైన చికిత్సకోసం మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ దవాఖానకు తీసుకెళ్లారు.అక్కడ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరా బాద్‌కు తరలిస్తుండగా పార్వతమ్మ అనే మహిళ మార్గమధ్యంలో మరణించారు.