నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

0
60

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.దీంతో దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలను చవి చూశాయి. అయితే,ఆరంభ నష్టాలను తగ్గించుకుని బీఎస్‌ఈ సెన్సెక్స్ ‌418 పాయింట్లు నష్టపోయి 36,699.84 వద్ద ముగియగా,నిఫ్టీ 134 పాయింట్ల నష్టంతో 10.862కు చేరింది.

ఉదయం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్‌ ఏకంగా 500 పాయింట్లకు పైగా నష్ట పోయింది.బలహీన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు. కశ్మీర్‌ వ్యవహారం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.సెన్సెక్స్‌ ఓ దశలో 700 పాయింట్ల భారీ నష్టాన్ని చవి చూసింది.

అయితే,తిరిగి కోలుకున్న సూచీలు ఆరంభ నష్టాలను కొంతమేర పూడ్చుకున్నాయి.కశ్మీర్‌ విభజన విషయంలో మదుపరుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో 418 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ముగిసింది.బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, లోహ షేర్లు అత్యధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.49గా ఉంది.