మాజీ మంత్రి,కాంగ్రెస్‌ నేత ముఖేశ్‌ గౌడ్‌ కన్నుమూత

0
244

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ముఖేశ్‌ గౌడ్‌ (60) కన్నుమూశారు.గత కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న సంగతి విదితమే.అయితే ఆదివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.

చికిత్స పొందుతూ ఆయన సోమవారం మృతిచెందారు.1959 జులై 1న జన్మించారు.ఎమ్మెల్యే,మంత్రిగా కాంగ్రెస్‌ పార్టీకి ఎనలేని సేవలు అందించారు. ఆయనకు ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు. 1989,2004 ఎన్నికల్లో మహారాజ్‌ గంజ్‌ నుండి, 2009లో గోషామహల్‌ అసెంబ్లీ స్థానాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నిన్న సీనియర్‌ నాయ కుడు జైపాల్‌ రెడ్డి, నేడు ముఖేశ్‌ గౌడ్‌ మృతిచెందడం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని పలువురు నాయ కులు వివరించారు.