కాలిఫోర్నియా ఫుడ్‌ ఫెస్టివల్‌లో కాల్పులు – ముగ్గురు మృతి

0
131

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
అగ్రరాజ్యం అమెరికాలో ఏదో ఒక సంఘటన మీద కాల్పులు తరచూ జరుగుతూనే ఉన్నాయి.తాజాగా కాలిఫోర్నియాలో ఓ ఫుడ్‌ ఫెస్టివల్‌ సాగుతుండగా అక్కడ గుమికూడిన వారిపై విరుచుకుపడిన ఆగంత కుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు.

మూడు రోజుల గిల్‌రే గార్లిక్‌ ఫెస్టివల్‌ చివరి రోజున ఈ ఘటన జరిగింది. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మరణించారు.ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.కాల్పుల ఘటనతో ఫుడ్‌ ఫెస్టివల్‌కు హాజరైన వారు భయంతో ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు.

కాల్పుల శబ్ధాలతో ఉలిక్కిపడిన సందర్శకులు తొలుత బాణాసంచా పేలుళ్లుగా భావించామని ప్రత్యక్ష సాక్షుల్లో కొందరు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మర్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌గా పేరొందిన గిల్‌రే ఫుడ్‌ ఫెస్టివల్‌పై దాడి ఆందోళనకరమని అధికారులు పేర్కొన్నారు.